Share News

మధ్యవర్తిత్వంతోనే సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:24 PM

మద్యవర్తిత్వంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి పి వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు.

మధ్యవర్తిత్వంతోనే సమస్యలు పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారులు

న్యాయాధికారులు పి. వాసు, లీలా వెంకట శేషాద్రి

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మద్యవర్తిత్వంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి పి వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం ఆళ్లగడ్డ కోర్టు అవరణలో మధ్యవర్ధ్తిత్వం 3.0పై న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం 3.0 ప్రముఖ్యతను వివరించారు. కక్షిదారుల మధ్య తలెత్తే వివాదాలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ రవి కుమార్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుబ్బయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివరామిరెడ్డి, కార్యదర్శి గోపాల్‌రెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:24 PM