సంక్షేమానికి పెద్దపీట : మంత్రి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:04 PM
కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 26, 27వ వార్డులలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశా రు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందిన లబ్ధిదారుల ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పేదల సంక్షేమం కోసం చంద్ర బాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రతిఒక్కరూ ఆదరిం చాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరి బాబు, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్ దిలీ్‌పకుమార్, జైనాబీ, వెంకటసుబ్బయ్య, మిద్దె హుసేని, కొండారెడ్డి, కృపాకర్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మెప్మా పీడీ వెంకటదాసు, నంద్యాల అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.