విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:31 PM
రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
డ్రాపౌట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి
కలెక్టర్ రాజకుమారి
పాణ్యం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ఆమె మండ లంలోని బలపనూరు జడ్పీ ఉన్నత, బీసీ గురుకుల పాఠశాలలను తనిఖీ నిర్వహించారు. లీప్ యాప్‌లో తల్లిదండ్రుల వివరాల నమోదును పరిశీలించారు. విద్యా బోధన, హాజరు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టరు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచి డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెల లీప్ యాప్‌లో నమోదయ్యే సమాచారం కచ్చితంగా సకాలంలో ఉండేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో అలా్ట్ర హైడెన్సిటీ ప్లాంటేషన్‌లో పాల్గొని విద్యార్థినులతో కలసి 1625 మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఎంఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.