వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:25 AM
కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అఽధ్యక్షు రాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అఽధ్యక్షు రాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 19, 20, 21 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.4.11 కోట్ల తో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ కల్లూరు అర్బన వార్డుల్లో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసు కున్నామని, ప్రజా అవసరాల మేరకు ప్రాధాన్యత క్రమంలో రహదారులు, డ్రైన్లు, తాగునీరు, బీటీ రోడ్లు వంటి మౌలిక సదుపా యాల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రా హ్మణ కార్పొరేషన చైర్‌పర్సన పార్వతమ్మ, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మ న పెరుగు పురుషోత్తంరెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, రాఘవేంద్రారెడ్డి, ప్రభాకర్‌యాదవ్, పల్లె రఘునాథ్‌రెడ్డి, కృష్ణాయాదవ్, చాంద్‌బాషా, లక్ష్మణ్, గంగాధర్, భరత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.