సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:37 PM
నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైమ్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన గ్రీవెన్స్‌డేలో ఎస్పీ పాల్గొన్నారు. స్వయంగా ఆయన పోలీసు సిబ్బంది అర్జీలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వివిధ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలందింలా చర్యలు తీసుకుంటామన్నారు.