మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:00 AM
కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధి, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధి, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు అర్బనలోని 41, 29, 19వ వార్డుల్లో సూమారు రూ.1.29 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ.రోడ్లు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆమె మాట్లా డుతూ కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ సమస్యలను పరి ష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కే.పార్వతమ్మ, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్ ఎస్‌కే.శ్రీనివాసరావు, కల్లూరు అర్బన కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జవ్వాజి. గంగాధర్ గౌడ్, కాసాని మహేష్‌గౌడ్, ప్రభాకర్‌యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
ప్రజా వినతులపై బాధ్యతగా స్పందించండి: ప్రజా సమస్య లపై వచ్చే విన్నపాలను ఆయా శాఖల అధికారులు బాధ్యతగా స్పం దించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మాధవీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ చిన్నపాటి సమస్యలపై ప్రజలను కార్యాలయాలకు తిప్పుకోవద్దని తక్షణమే పరిష్కారం చూపి సానుకూలంగా సేవలందించాలన్నారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన, 4 మండలాల ప్రజలు పాల్గొన్నారు.