Share News

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:33 PM

రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
ప్రశంసా పత్రాలతో విద్యార్థులు, మంత్రి, కలెక ్టర్‌, డీటీవో శివారెడ్డి

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక విజయ డెయిరీ సమీపంలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్‌ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్తు పదార్ధాలు సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్లో మాట్లాడటం తగదని, ఒక ప్రమాదాన్ని నివారిస్తే ఒక తరాన్ని కాపాడినట్లేనన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నూనెపల్లె బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోందని, బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేక సర్వీసు రోడ్డును ఏర్పాటుచేస్తామన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మా ట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత బాధ పడేకన్నా, ప్రమాదానికి ము ందు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఆటో, లారీల డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖాధికారి శివారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ మదన్‌మోహన్‌, చాపిరేవుల టోల్‌ప్లాజా అధికారులు, లారీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:33 PM