Share News

అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు తొలగించాలి

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:44 AM

వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా పంట పొలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ కనెక్షన్లను తొలగించేందుకు విద్యుత్‌, అటవీశాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ సూచించారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటి ఎకో టూరిజంలో విద్యుత్‌, అటవీశాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు తొలగించాలి
మాట్లాడుతున్న డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌

వన్యప్రాణుల సంరక్షణకు అటవీ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి

ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌

ఆత్మకూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా పంట పొలాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ కనెక్షన్లను తొలగించేందుకు విద్యుత్‌, అటవీశాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ సూచించారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటి ఎకో టూరిజంలో విద్యుత్‌, అటవీశాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 డిసెంబరు 5న జరిగిన సమావేశంలోని పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రత్యేకించి అటవీ సమీప, వ్యవసాయ క్షేత్రాల్లో వేటగాళ్లు అక్రమ విద్యుత్‌ కనెక్షన్లను ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ముప్పు కలిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటి నియంత్రణ కోసం గత మూడేళ్ల వ్యవధిలోని ఫీడర్లు, వారి ట్రిప్పింగ్‌ డేటాను ఈ నెల 25వ తేదీలోగా తమకు సమర్పించాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. అలాగే వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో అమర్చిన అక్రమ విద్యుత్‌ కనెక్షన్లను తొలగించాలని తెలిపారు. అదేక్రమంలో ఆయా ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఆయా శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. అలాగే వన్యప్రాణులకు విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా అన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Apr 16 , 2026 | 12:44 AM