Share News

జల వనరుల ప్రణాళిక సిద్ధం చేయండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:45 PM

జలధార- జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో గ్రామ నీటి వనరుల ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

జల వనరుల ప్రణాళిక సిద్ధం చేయండి
కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : జలధార- జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో గ్రామ నీటి వనరుల ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి గ్రామీణ నీటి వనరుల సమగ్ర అభివృద్ధి, క్షేత్రస్థాయి పర్యవేక్ష ణకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రణాళికలను సిద్ధం చేసి ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. నిల్వ సామర్థ్యాన్ని వార్మ్స్‌ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రణాళికలను శుక్రవారం సమర్పించాలని గడువు విధించారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వాటర్‌ రిసోర్స్‌ ఇంజనీర్లు ఒకరికొకరు సమన్వయంతో పనిచేసి పునరుద్ధరణ పనులకు అంచనాలు సిద్ధం చేసి ఎంపీడీఓ లాగిన్‌లో పంపాలన్నారు. కలెక్టర్‌ ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.

Updated Date - Apr 23 , 2026 | 11:45 PM