Share News

పల్లెపోరుకు ఏర్పాట్లు సిద్ధం

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:55 PM

కల్లూరు మండలంలో పల్లెపోరుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు.

పల్లెపోరుకు ఏర్పాట్లు సిద్ధం
ఎన్నికల సామగ్రిని తీసుకెళ్తున్న సిబ్బంది

ఎన్నికల సామగ్రితో కదిలిన యంత్రాంగం

ఉదయం 7గంటల నుంచే పోలింగ్‌

కల్లూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలంలో పల్లెపోరుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 7నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. మండలం లో 18 పంచాయతీలుండగా 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 15 పంచాయ తీల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకు న్నారు. ఈ మేరకు శనివారం కల్లూరు మండల పరిషత కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి నాగశివలీల, ఏఈఆర్వో తహసీల్దారు కె.ఆంజనేయులు దాదాపు 600 మంది ఎన్నికల సిబ్బందికి విధులను అప్పగించారు. గ్రామాల వారీగా పీవో ఓపీవో, రూట్‌ ఆపీసర్లు ఇతర సిబ్బందిని నియమించారు. సాయంత్రం ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో గ్రామాలకు బయలుదేరారు.

అన్ని ఏర్పాట్లు..

ఓర్వకల్లు: స్థానిక సంగ్రామానికి రంగం సిద్ధమైంది. సర్పంచ, వార్డు సభ్యుల రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఓర్వకల్లులోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బంది సాయంత్రానికి పోలింగ్‌ సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. ఎంపీడీవో నాగ అనసూయ, తహసీల్దార్‌ విద్యాసాగర్‌ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. మండలంలో 22 గ్రామ పంచాయ తీలుండగా.. అందులో ఒక పంచాయతీ గ్రామం ఎన.కొంతలపాడు పంచాయతీ ఏకగ్రీవం కావడంతో 21 పంచాయతీల్లో 58 మంది సర్పం చలు పోటీలో నిలిచారు. 212 మంది వార్డు మెంబర్లు బరిలో ఉండగా.. 212 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. దాదాపు 500 మంది పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారు. ఆయా గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన అమలులో ఉందని తహసీల్దార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కర్నూలు రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 28 , 2026 | 11:55 PM