Share News

ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:14 PM

జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 501 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఎన్నికలకు కసరత్తు
సామగ్రిని పరిశీలిస్తున్న డీపీవో భాస్కర్‌

మండలాల వారీగా పోలింగ్‌ సామగ్రి సిద్ధం

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలు, 501 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్‌ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రిని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్‌, డీఎల్‌పీఓ టి. లక్ష్మి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని మండలాల వారీగా విభజించారు. ఈ సందర్భంగా డీపీఓ భాస్కర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలకు అవసరమైన సామగ్రి అంతా వచ్చిందన్నారు. ఈ సామగ్రిని గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఏఓ శిరీష, సీనియర్‌ అసిస్టెంట్‌ స్వామి పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:14 PM