వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:09 AM
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్ర మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ హుసేనమ్మ
ఆత్మకూరు రూరల్, జూన్ 11 ( ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం మలేరియా మాసోత్స వాల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని గరీబ్‌నగర్ లోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా త నిఖీ చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి మలేరియాపై అవగాహన, దోమల నివారణ చర్యల కోసం సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఆత్మకూరు ప్రాంతంలో గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటం వల్ల ఎక్కడబడితే అక్కడ వర్షపునీరు నిలిచి దోమలు ప్రబలేందుకు ఆస్కారం వుందని చెప్పారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అప్పుడే రోగాలు దరిచేరవని ప్రజలకు సూచించారు. పట్టణంలో ఫాగింగ్, స్ర్పేయింగ్ చేయించాలని, అలాగే వసతి గృహాలలో ముందస్తుగా స్ర్పేయింగ్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి నిత్య పూజారి, ఆరోగ్య కార్యకర్తలు విశ్వనాఽథ్, భాస్కర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.