ప్రసాదం పవిత్రం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:29 PM
శ్రీశైల క్షేత్రం దర్శించుకోడానికి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పవిత్రంగా అందించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ పోతుగుంట రమే్‌షనాయుడు ఆలయ అధికారులు సిబ్బందికి సూచనలిచ్చారు.
నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయాలి
శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు
లడ్డూ విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
శ్రీశైలం, జులై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రం దర్శించుకోడానికి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పవిత్రంగా అందించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ పోతుగుంట రమే్‌షనాయుడు ఆలయ అధికారులు సిబ్బందికి సూచనలిచ్చారు. ఆదివారం సాయంత్రం లడ్డూ విక్రయ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశాడు. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తగు మార్పు చేర్పులను సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శనానంతరం తిరుగు ప్రయాణ మయ్యే భక్తులు ప్రసాదాల కోసం గంటల తరబడి వేచి ఉండకుండా విక్రయాలు వేగవంతంగా జరపాలని సిబ్బందికి సూచించారు. లడ్డూ ప్రసాదాలతోపాటు పులిహోర తయారీలో నాణ్యత ప్రమాణాలు, శుచి శుభ్రత తప్పక పాటించాలని అన్నారు. గోమయ ఉత్పత్తులను కూడా భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. విక్రయ లావాదేవీలు నగదు వ్యవహారాలు పక్కాగా ఉంచుకోవాలని చెప్పారు. భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకుండా మర్యాదపూర్వకంగా మెలగాలని విక్రయ కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందిని హెచ్చరించారు.