రజత గజ వాహనంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:26 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంత్రాలయం, జూన్ 21(ఆంధ్రజ్యోతి) : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం జ్యేష్ఠ సప్తమి శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండి తుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య రజత గజ వాహనంపై స్వర్ణ అంబారిలో ప్రహ్లాదరాయలను అధిష్ఠించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. విద్యుత్ కాంతుల మద్య గజవాహనం ఊరేగుతుండగా భక్తులు జయహో... గురు రాఘవేంద్ర... విజయహో.. అంటూ పెద్దఎత్తున జయద్వనులతో మఠం ప్రాంగణం మార్మోగింది.