Share News

పవర్‌ గ్రిడ్‌ అధికారుల దౌర్జన్యం

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:24 AM

పవర్‌గ్రిడ్‌ అధికారులు తమపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. తమ అనుమతి లేకుండా విద్యుత్‌ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తూ, పంటలను తొక్కేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పవర్‌ గ్రిడ్‌ అధికారుల దౌర్జన్యం
బాధిత రైతు చిన్న సూర్యనారాయణరెడ్డి

అనుమతి లేకుండానే స్తంభాల ఏర్పాటు చేశారని రైతుల ఆరోపణ

కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పవర్‌గ్రిడ్‌ అధికారులు తమపై దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. తమ అనుమతి లేకుండా విద్యుత్‌ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తూ, పంటలను తొక్కేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని తిమ్మనాయినిపేట గ్రామం సర్వే నెం. 507, 508, 506లోని నందిపాడు రైతు అంగేరి చిన్న సూర్యనారాయణరెడ్డి తన పొలంలో అనుమతి లేకుండానే లైన్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని సోమవారం విలేకరుల ముందు వాపోయాడు. జిల్లా రెవెన్యూ అధికారులకు పిర్యాదుచేసినా స్పందించండం లేదని, పవర్‌గ్రిడ్‌ సిబ్బంది నిభంధనలు పాటించడం లేదని ఆరోపించారు. పవర్‌ గ్రిడ్‌ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 12:24 AM