Share News

పానీపాట్లు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:30 PM

కోసిగిలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలోని ఈశ్వర స్వామి దేవాల యం సమీపంలో తాగునీటి ట్యాంకుకు నీరు తక్కువగా ఉండటంతో పెద్దఎత్తున కాలనీల ప్రజలు బిందెలతో బారులు తీరారు.

పానీపాట్లు
ఈశ్వరస్వామి దేవాలయం సమీపంలో తాగునీటి కోసం బారులు తీరిన ప్రజలు

తాగునీటి ట్యాంకు వద్ద బారులు తీరిన ప్రజలు

ట్యాంకుపైకి ఎక్కి బిందెలు నింపుకుంటున్న వైనం

కోసిగి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కోసిగిలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలోని ఈశ్వర స్వామి దేవాల యం సమీపంలో తాగునీటి ట్యాంకుకు నీరు తక్కువగా ఉండటంతో పెద్దఎత్తున కాలనీల ప్రజలు బిందెలతో బారులు తీరారు. వాటర్‌మెన్‌ ట్యాంకును పూర్తిగా నింపకపోవడంతో ఉన్న కొద్దిపాటి నీటి కోసం ఉదయం నుంచి మహిళలు, యువకులు, పెద్దలు కలిసి తాగునీటి కోసం ఎగబడ్డారు. ఖాళీ బిందెలతో మహిళలు, పెద్దలు గంటల తర బడి నిరీక్షించారు. నాగన్నకట్ట, పోతులగేరి, బు ల్లొలగేరి, పరసయ్యగేరి, పెద్దమసీదు కాలనీలకు చెందిన వందలాది మంది ప్రజలు ఉదయం నుంచే తాగునీటి ట్యాంకు వద్దకు చేరుకున్నారు. పిల్లలు, పెద్దలు ప్రమాద కరమని తెలిసినా కూడా ట్యాంకుపైకి ఎక్కి ట్యాంకులో ఉన్న నీటిని తోడుకుంటూ నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదం అని తెలిసినా కూడా దాహార్తిని తీర్చుకునేందుకు తిప్పలు తప్పడం లేదన్నారు. పంచాయతీ అధికారులు తాగునీటి ట్యాంకును పూర్తి స్థాయిలో నింపి మా కాలనీలకు నీటి సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 12 , 2026 | 11:30 PM