Share News

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:09 PM

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగింది. నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అడిషనల్‌ ఎన్నికల అఽథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పర్యవేక్షణలో.. పోలీసు పహారా మధ్య పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

ప్రశాంతంగా పోస్టల్‌  బ్యాలెట్‌ ఓటింగ్‌

ఓటు వేసిన 1,106 మంది ఉద్యోగులు

కమిషనర్‌ చల్లా ఓబులేసు పర్యవేక్షణ

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగింది. నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అడిషనల్‌ ఎన్నికల అఽథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పర్యవేక్షణలో.. పోలీసు పహారా మధ్య పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. నగరంలోని 68 వార్డులకు చెందిన బ్యాలెట్‌ పోలింగ్‌లో ఉద్యోగులు బారులు తీరి కనిపించారు. కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, పోలీసు సిబ్బందికి నిర్వహించిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారని కమిషనర్‌ చల్లా ఓబులేష్‌ తెలిపారు. 763 మంది పురుషులు, 343 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్‌ ఓటు వేసేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. ఈ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులైన టీడీపీ మేయర్‌ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష, వైసీపీ మేయర్‌ అభ్యర్థి సుశీల, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మెహన్‌రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి, పలు వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, జనసేన జిల్లా సమన్వయ కర్త అర్షద్‌ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు.

Updated Date - Oct 27 , 2026 | 11:09 PM