Share News

మహిళలకు రక్షణగా పోష్‌ చట్టం

ABN , Publish Date - May 09 , 2026 | 11:38 PM

కార్యస్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ‘ఫోష్‌ చట్టం’ ప్రధాన ఆయుధంగా మారిందని, ఈ చట్టం మహిళల రక్షణగా ఉందని జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ తెలిపారు.

మహిళలకు రక్షణగా పోష్‌ చట్టం
మాట్లాడుతున్న సీఈవో వేణుగోపాల్‌

కర్నూలు స్పోర్ట్స్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): కార్యస్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ‘ఫోష్‌ చట్టం’ ప్రధాన ఆయుధంగా మారిందని, ఈ చట్టం మహిళల రక్షణగా ఉందని జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌ తెలిపారు. శనివారం రవీంద్ర మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో పోష్‌ చట్టం, మహిళా సాధికారకత అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సీఈవో వేణుగోపాల్‌ మాట్లాడుతూ పోష్‌ చట్టం వేధింపులకు వేగవంతమైన పరిష్కారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం డా.మాధవి శ్యామల పోష్‌ చట్టంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. 10 మంది, అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఫిర్యాదు చేసిన మహిళలు 3-6 నెలల్లోపు న్యాయం పొందవచ్చని చెప్పారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు నజీమా కౌసర్‌ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ చట్టం వినియోగదారులకు తప్పుదారి పట్టించే ప్రకటనలు, డిఫెక్టివ్‌ వస్తువులు, సేవల లోపాలపై ఫిర్యాదు చేసే సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఉషశ్రీ, సెట్కూరు సిబ్బంది నిదీష్‌ కుమార్‌, శ్రీనివాస్‌ సింగ్‌, మౌలాలి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 11:38 PM