చెరువు అభివృద్ధి
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:28 AM
మండలంలోని ముక్కమళ్ల చెరువు నాడు ముళ్లకంపతో నిండిపో అధ్వానంగా ఉండది. గేట్లు, అలుగు లీకేజీతో నీరు వృథాగా పోయి రైతులు ఇబ్బంది పడేవారు. 2019-2024 వరకు వైసీపీ పాలనలో చెరువును పట్టించుకోలేదు.
ముక్కమళ్ల చెరువుకు రూ.6లక్షలు కేటాయించిన మంత్రి బీసీ
సంజామల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముక్కమళ్ల చెరువు నాడు ముళ్లకంపతో నిండిపో అధ్వానంగా ఉండది. గేట్లు, అలుగు లీకేజీతో నీరు వృథాగా పోయి రైతులు ఇబ్బంది పడేవారు. 2019-2024 వరకు వైసీపీ పాలనలో చెరువును పట్టించుకోలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రావడం మంత్రిగా బీసీ జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో చెరువు అభివృద్ధి చెందింది. రూ 6లక్షల నిధులను మంజూరు చేయడంతో టీడీపీ నాయకులు మూసాని చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముళ్లకంపు తొలగించారు. చెరువు కట్టపై జంగిల్ క్లియరెన్స్‌తో పాటు కొత్త గేట్లు, తూములు, అలుగు నిర్మించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసి చెరువు నిండితే చేరితే 800 ఎకరాలకు రెండు కార్ల పంటలకు సాగునీరు అందే అవకాశముందని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.