నిండు జీవితానికి రెండు చుక్కలు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:07 AM
పోలియో రహిత సమాజమే లక్ష్యమని డబ్ల్యూ.కొత్తపల్లె వైద్యాధికారులు ఉసేన్, సతీ్‌షరెడ్డి అన్నారు.
నేడు అన్ని మండలాల్లో పల్స్ పోలియో
దొర్నిపాడు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజమే లక్ష్యమని డబ్ల్యూ.కొత్తపల్లె వైద్యాధికారులు ఉసేన్, సతీ్‌షరెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో వైద్యాధికారి ఉసేన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం 0-5 సంవత్సరాల చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేయిస్తే పోలియోను తరిమేసిన వారవుతారని అన్నారు. 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఎంపీహెచ్‌ఈవో బాబయ్య, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు.
చాగలమర్రి: నేడు నిర్వహిచంనున్న పల్స్‌పోలియోను విజయవంతం చేయాలంటూ సంచార చికిత్స జిల్లా నోడల్ అధికారి జగదీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలు తస్లీమ్ సుల్తాన మాట్లాడుతూ మండలంలో 32 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,556 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 64 మంది సిబ్బందిని నియమించామని అన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు ప్రత్యూష, ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేశ్వర్లు, హెచ్‌ఈ విజయభారతి, సూపర్‌వైజర్ సారమ్మ, హెచ్‌ఏ మనోహర్, శ్రీనివాసనాయక్ ఉన్నారు.
రుద్రవరం: పల్స్‌పోలియోకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాఽధికారి నాగశ్రీజారెడ్డి అన్నారు. జూన్ 28న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 3206 మంది చిన్నారులకు వేయాలనే లక్ష్యం ఉందన్నారు. సూపర్‌వైజరు రసూల్, సిబ్బంది పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: పోలియో చుక్కలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారి నాగజ్యోతి పేర్కొన్నారు. పోలియో చుక్కలను వేయించాలని ఆర్టీసి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ నాగార్జున, సిహెచ్‌ఓలు పరమేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ గణేష్, సిబ్బంది చెన్నమ్మ, పద్మావతి పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: పల్స్ పోలియోను విజయవంతం చేయాలని మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాబర్ట్ కెనడి పేర్కొన్నారు. శనివారం వెలుగు కార్యాలయంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలతో పల్స్ పోలియోపై అవగాహన సదస్సు నిర్వహించారు.
డోన్ టౌన్ : 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడు శనివారం ప్రకటనలో కోరారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులు, బస్టాండు, రైల్వే స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు.