Share News

ప్రశాంతంగా పోలింగ్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:44 PM

డోన్‌ మున్సిపాలిటీ, బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. కాగా టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే వైసీపీ నాయకులు ఓటమి భయంతో డ్రామాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోట్ల విమర్శించారు.

ప్రశాంతంగా పోలింగ్‌
డోన్‌లో బారులుతీరిన మహిళా ఓటర్లు..

డోన్‌ మున్సిపాలిటీలో 67.84 శాతం

బేతంచెర్ల నగర పంచాయతీలో అత్యధింగా 78.53 శాతం నమోదు..

పరిశీలించిన జేసీ సూరజ్‌ ధనుంజయ

డోన్‌ టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిం దని అధికారులు తెలిపారు. పట్టణంలో 36 వార్డులుండగా, ఒక వార్డు ఏకగ్రీవమైన విషయం పాఠకులకు విదితమే. 35 వార్డులకు అధికారులు 72 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగిందని అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అథారిటీ, మున్సిపల్‌ కమిషనర్‌ కే.నరేష్‌ రెడ్డి తెలిపారు. 52,176 మంది ఓటర్లకు గాను 35,367 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, 67.84 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ, పరిశీలకుడు మురళీకృష్ణ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఖాదర్‌ బాషా, డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సీఐలు ఇంతియాజ్‌ బాషా, సీఎం రాకేష్‌, ఎస్‌ఐలు శరత్‌ కుమార్‌ రెడ్డి, బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేపీ నరసింహులు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

బేతంచెర్లలో 78.54 శాతం..

బేతంచెర్ల: నగర పంచాయతీఎన్నికల్లో 78.54 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆర్‌వో హరిప్రసాద్‌ తెలిపారు. మొత్తం 31, 285 మంది ఓటర్లు ఉండగా 24,571 మంది ఓటు వేశారన్నారు. 56 పోలింగ్‌ కేంద్రాల్లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమే్‌షబాబు బందోబస్తు నిర్వహించారు

Updated Date - Nov 01 , 2026 | 11:44 PM