Share News

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:57 PM

కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కేంద్ర మాజీ మంత్రి, జిల్లా ఎన్నికల సమన్వయకర్త జేడీ శీలం కోరారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్పొరేషన్‌ మేయర్‌, కార్పొరేటర్‌ ఆశావహుల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి జె. లక్ష్మీనరసింహతో కలిసి సమీక్షించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేయాలి
మాట్లాడుతున్న జేడీ శీలం

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కేంద్ర మాజీ మంత్రి, జిల్లా ఎన్నికల సమన్వయకర్త జేడీ శీలం కోరారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్పొరేషన్‌ మేయర్‌, కార్పొరేటర్‌ ఆశావహుల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి జె. లక్ష్మీనరసింహతో కలిసి సమీక్షించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుప ుకోసం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. అభ్యర్థులు ఎవరైనా కలిసి కట్టుగా పని చేయాలని, కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు బాధ్యతగా పని చేయాలని కోరారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, కర్నూలు జడ్పీటీసీ, ఎంపీటీల కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల కోసం ప్రచారం చేయాలని అన్నారు. డీసీసీ బి. క్రాంతి నాయుడు, సిటీ అధ్యక్షుడు షేక్‌ జీలానీ బాషా, ఏఐసీసీ సభ్యులు ఎం. సుధాకర్‌బాబు, అనంతర్నం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:01 AM