పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:49 PM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ (అడ్మిన్) ఎస్.ఖాదర్‌బాషా అన్నారు. ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేర
ఏఎస్పీ (అడ్మిన్) ఖాదర్ బాషా
డోన్ టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ (అడ్మిన్) ఎస్.ఖాదర్‌బాషా అన్నారు. ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు డీఎస్పీ పి.శ్రీనివా్‌సతో కలిసి శనివారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
650 మంది పోలీసులతో బందోబస్తు: డీఎస్పీ శ్రీనివాస్
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్తమక రప్రాంతాలను గుర్తించి చర్యలు తీసకున్నామన్నారు. పోలింగ్ రోజు అల్లర్లు సృష్టించినా, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అత్యంత సమస్యాత్మక 32 పోలింగ్ కేంద్రాల పరిఽధలోని 22,500 మంది ఓటర్లను, అలాగే సమస్యాత్మక కేంద్రాలు 8 కాగా, వాటిలో 31 పోలింగ్ స్టేషన్లను 13,500 మంది ఓటర్లను పోలీసులు కవర్ చేస్తారన్నారు. దొంగ ఓట్లు, ఓటర్లను బెదిరించి ప్రలోబాలకు గురి చేయడం, అక్రమాలను అరికట్టేందుకు పోలీసులను ఏర్పాటు చేశామనానరు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, పోలింగ్‌ను అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బందోబస్తులో ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరు మంది సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 42 మందితో పాటు 650 మంది సిబ్బందితో విధులు నిర్వర్తిస్తునానరని ఏఏఎస్పీ వివరించారు.
స్వేచ్ఛగా ఓటు వేయండి..
ఓటర్లు స్వేచ్చగా ఓటు వేయాలని డోన్ అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ కె.నరేశ్ రెడ్డి తెలిపారు. శనివారం మాట్లాడుతూ ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ కేంద్రం నుంచి పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారని తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుదని, 36 వార్డులకు గానూ 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటు వేసుందకు స్లిప్పు తప్పనిసరి కాదని ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీచేసిన ఐడీ కార్డు చూపి ఓటు వేయవచ్చని తెలిపారు.