Share News

26న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:40 PM

ఈ నెల 26న ఏపీఎ్‌సపీ 2వ బెటాలియన్‌ మైదానంలో 629 మంది ట్రైనీ పోలీసులకు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికా పాటిల్‌ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

26న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికా పాటిల్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26న ఏపీఎ్‌సపీ 2వ బెటాలియన్‌ మైదానంలో 629 మంది ట్రైనీ పోలీసులకు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికా పాటిల్‌ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీఎ్‌సపీ 2వ బెటాలియన్‌లో శిక్షణ పొం దిన 430 మంది, కర్నూలు డీటీసీలో శిక్షణ పొందిన 199 మంది ట్రైనీ పోలీసులు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. మొత్తం 629 మంది ట్రైనీ పోలీసులకు బెటాలియన్‌ మైదా నంలో పాసింట్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌, కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, కలెక్టర్‌ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారన్నారు. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమాన్ని సమన్వ యంతో విజయవంతం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు చేశారు. పరేడ్‌ మైదానంలో నియమ నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన వారికి బెస్ట్‌ ఔట్‌డోర్‌, బెస్ట్‌ ఇన్‌డోర్‌, ఓవరాల్‌, బెస్ట్‌ ఫైరింగ్‌, బెస్ట్‌ పరేడ్‌ కమాండర్‌, బెస్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర విభాగాల్లో పోలీసులకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ట్రైనీ కుటుంబం నుంచి ఇద్దరికి మాత్రమే గ్యాలరీలోకి అనుమతి ఉంటుందని ఇందుకోసం ప్రతి ట్రైనీకి రెండేసి పాసులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అడిషినల్‌ ఎస్పీ హుస్సేన్‌పీరా, అడిషినల్‌ కమాండెంట్‌ నాగేంద్రరావు, అసిస్టెంట్‌ కమాండెంట్లు వెంకటరమణ, బాషా, వెంకట శివుడు, డీటీసీ వైస్‌ ప్రిన్సిపల్‌ దుర్గాప్రసాద్‌, డీఎస్పీలు ఓబులేసు, సుధాకర్‌ రెడ్డి, సీఐలు విక్రమసింహ, వెంకట కృష్ణారెడ్డి, ఆర్‌ఐలు జావేద్‌, నారాయణ, ఆర్‌ఎ్‌సఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు

Updated Date - Sep 21 , 2026 | 11:40 PM