పీఎంఎఫ్‌ఎంఈ యూనిట్లను పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:54 PM
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కింద జిల్లాకు మంజూరైన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కింద జిల్లాకు మంజూరైన యూనిట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పీఎంఎఫ్‌ఎంఈ పైన అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి అనుకూలమైన వసతులున్నాయని అధికారులు బ్యాంక్ మేనేజర్లతో సమన్వయం చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. 2025-26లో ఇచ్చిన టార్గెట్‌ను జూలై 15లోపు పూర్తి చేయాలన్నారు. 2026-27కు సంబంధించి జిల్లాకు 50 యూనిట్ల టార్గెట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించి ఈ నెల చివరిలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, ఎల్‌డీఎం, డీఎం నాబార్డ్, బ్యాంకుల మేనేజర్లు, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.