Share News

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:11 AM

కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.

పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ ప్రారంభం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

హాజరైన ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో పీఎం సూర్యఘర్‌ ఉత్సవ్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. కర్నూలు ఆపరేషన సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత వినియోగదారులు సోలార్‌ రూప్‌ టాప్‌ పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. పాణ్యం నియోజకవర్గంలో 2,981 యూనిట్లు గుర్తించామని, కల్లూరు మండలానికి 1611 యూనిట్లు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ కర్నూలు నోడల్‌ ఆఫీ సర్‌ ఆర్‌.పద్మ, ఎంపీ డీఓ జి.నాగశేషాచలరెడ్డి, విద్యుత ఏఈ వెంకటేశ్వర్లు, కల్లూరు సింగిల్‌విండో చైర్మెన డి.శేఖర్‌, టీడీపీ నాయకులు జాఫర్‌, దేవేంద్రారెడ్డి, కాంత మోహనరెడ్డి పాల్గొన్నారు.

పీ4 అమలుపై ఎమ్మెల్యే సమీక్ష: పాణ్యం నియోజకవర్గంలో పీ4 అమలుపై ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి సమీక్షించారు. శుక్రవారం మాధవీ నగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాణ్యం నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డిప్యూటీ జీడ్పీ సీఈఓ ఈవీ.సుబ్బారెడ్డి బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న పథకాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, పనుల వేగవంతం, నాణ్యతపై ఆమె సమీ క్షించారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 11 , 2026 | 12:11 AM