పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:33 AM
మండలంలోని వర్కూరు న్యూఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజర య్యారు.
ఎంపీ, ఎమ్మెల్యే, కేడీసీసీబీ చైర్మన హాజరు
కోడుమూరు రూరల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని వర్కూరు న్యూఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజర య్యారు. విద్యుత శాఖ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడు తూ సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ లందరూ వినియోగించుకోవాలని కోరారు. కోడుమూరులో తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడు తూ ఎస్సీ నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్, ఈఈలు శేషాద్రి, విజయరాజు డీఈ నాగేంద్రప్రసాద్, ఏడీఈ జేషన ఏఈలు మధుసూదన, శ్రీనివాసనాయక్, కన్నా సుకుమార్ పాల్గొన్నారు.
పట్టణంలో ఫోర్‌లైన రోడ్డు వేయిస్తాం: కేడీసీసీబీ చైర్మన
కోడుమూరు పట్టణంలో నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ విష యమై రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దనరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి తెలిపారు. వర్కూరులో పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లా డారు. కోడుమూరులో తాగునీటి సమస్య పరిస్కారానికి రూ. 38 కోట్లు మంజూ రయ్యాయన్నారు. టెండరు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభ మవుతాయన్నారు.