పీఎం సూర్యఘర్ ఉత్సవ్ ప్రారంభం
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:31 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్ తెలిపారు.
జిల్లాకు మంజూరైన గృహాలు 23,077
కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్
కల్లూరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ వరకు పీఎం సూర్యఘర్ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ప్రదీ్‌పకుమార్ తెలిపారు. ఆదివారం కల్లూరు మండలం ఏ.గోకులపాడులో డా.బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గృహాలపై పీఎం సూ ర్యఘర్ పథకం రాష్ట్ర ప్రభుత్వ యూఎల్‌ఏ మోడల్ ద్వారా పెద్దఎత్తున సోలార్ రూఫ్‌టాఫ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు జిల్లాకు 23,077 గృహాలకు ఈపథకం వర్తించనుందన్నారు. కర్నూలు డివిజన్‌కు-8969, ఆదోనికు-7399, ఎమ్మిగనూరుకు-6749 గృహాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డివిజన్ల వారీగా గుత్తేదారులను నియమించి మొదటి దశలో 6000 గృహాల్లో సోలార్ రూఫ్‌టాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్దం చేశామన్నారు. కర్నూలు ఈఈ టి.శేషాద్రి, ఏఈ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.