Share News

పీఎం సూర్యఘర్‌లో పురోగతి సాధించాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:36 PM

జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకంలో పురోగతి సాధించాలని కలెక్టర్‌ ఏ.సిరి విద్యుత శాఖా ధికా రులను ఆదేశించారు.

పీఎం సూర్యఘర్‌లో పురోగతి సాధించాలి
సోలార్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి

కల్లూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పథకంలో పురోగతి సాధించాలని కలెక్టర్‌ ఏ.సిరి విద్యుత శాఖా ధికా రులను ఆదేశించారు. ఏప్రిల్‌ నెలాఖరులోపు 4వేల సోలార్‌ రూప్‌ టాప్‌ కనెక్షన్లు పూర్తి చేయాలని ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌కు కలెక్టర్‌ సూచించారు. శుక్రవారం బీడీ వర్కర్స్‌కాలనీలో గౌరమ్మ నివాసంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్‌ పథకం కింద యూ ఎల్‌ఏ మోడల్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ రూప్‌టాప్‌ను కలెక్టర్‌ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సోలార్‌ పథకం ద్వారా వినియోగదారులు ఉచిత విద్యుత వాడుకోవడమే కాకుండా, విద్యుత ఉత్పత్తిదారులుగా కూడా మారుతారన్నారు. అర్హు లైన ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు ఇది పూర్తిగా ఉచితమని, ఇత రులకు మొదటి, రెండో కిలోవాట్‌కు రూ30వేలు, మూడో కిలో వాట్‌కు రూ. 78వేల వరకు సబ్సిడీ వస్తుందన్నారు. ప్రజలు ఈఅవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్‌ కింద 23,077 సోలార్‌ రూప్‌టాప్‌ యూనిట్లు మంజూర య్యాయని, ఇప్పటి వరకు 3038 యూనిట్స్‌ ఇనస్టాల్‌ పూర్తిచేశారని అన్నారు. రాష్ట్రంలో కర్నూలు 2వ స్థానంలో ఉందన్నారు. కార్యక్ర మంలో కర్నూలు టౌన డివిజన ఈఈ టి.శేషాద్రి, డీఈ విజయ భాస్కర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:37 PM