పంటలను కాపాడండి మహాప్రభో..
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:06 PM
ఎల్లెల్సీ కింద ఆయకట్టు పొలాలలో పంటలు ఎండిపోతున్నాయి. మాపై దయ తలచి మరో రెండు తడులు నీటిని విడుదల చేయండి మహాప్రభో..’ అంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని ఎల్లెల్సీ కార్యాలయం దగ్గర కులుమాల, అలువాల, చిన్నమరివీడు, పెద్దమరివీడు గ్రామాల కు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు.
గోనెగండ్ల ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
గోనెగండ్ల, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఎల్లెల్సీ కింద ఆయకట్టు పొలాలలో పంటలు ఎండిపోతున్నాయి. మాపై దయ తలచి మరో రెండు తడులు నీటిని విడుదల చేయండి మహాప్రభో..’ అంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని ఎల్లెల్సీ కార్యాలయం దగ్గర కులుమాల, అలువాల, చిన్నమరివీడు, పెద్దమరివీడు గ్రామాల కు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. సాగు చేసుకున్న పంటలకు నీటి విడుదల చేయాలని కోరారు. ఇరిగేషన్ కార్యాలయంలోని డీఈ విద్యాసాగర్ తో రైతులు తమ కష్టాను వివరించారు. అయితే డీఈ మాట్లాడుతూ ఎల్లెల్సీ కింద నీటి విడుదల జనవరి 10 తరువాత నిలిచిపోతున్నట్లు గతంలోనే ప్రకటించాము. కావున పంటలు సాగు చేసుకోవద్దని కూడా తెలిపాము అని అన్నారు. ఇందుకు రైతులు ఎల్లెల్సీ నుంచి నీటి విడుదల కాలేక పోతే పులికనుమ నుంచి నీటిని విడుదల చేయించమని డీఈ ని కోరారు. మండలంలో దాదాపు 2500 ఎకరాలలో పంటలు ఎండి పోతున్నాయని రైతులు వాపోయారు. పులికనుమ ద్వారా నీటి విడుదల చేయడం కష్టం అయితే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని డీఈ రైతులకు హామీ ఇచ్చారు. రైతులు తమ కష్టాలను డీఈకి వివరించారు.