తాగునీరివ్వండి సారూ..
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:56 PM
: పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి కొద్ది రోజులుగా తాగునీరు రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళశారం మహిళలు, సానికులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు
కోవెలకుంట్ల శ్రీరామ్‌నగర్ కాలనీ వాసుల వినతి
కోవెలకుంట్ల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి కొద్ది రోజులుగా తాగునీరు రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళశారం మహిళలు, సానికులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీలో దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయని, తాగునీటి పథకం నుంచి నీరు సరిగా రావడం లేదు, రోజూ తాగునీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని, అధికారులు స్పందించి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. ఈ విషయపై ఇన్‌చార్జి ఈవో ప్రకాష్ నాయుడును వివరణ కోరగా శ్రీరామ్‌నగర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పట్టణంలో ఎక్కడైనా తాగునీరు రాకుండే ప్రజలు నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని లేదా, వాట్సప్‌లో సమస్య తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు.