ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసర సరకులు
ABN , Publish Date - May 16 , 2026 | 11:19 PM
వేస్ట్ ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసర సరకులు కేజీ ప్లాస్టిక్‌కు చక్కెర, సేమియా, గుడ్లు ఇస్తున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల టౌన్, మే 16(ఆంధ్రజ్యోతి): వేస్ట్ ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసర సరకులు కేజీ ప్లాస్టిక్‌కు చక్కెర, సేమియా, గుడ్లు ఇస్తున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ రాజకుమారితో కలిసి గాంధీచౌక్‌లో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారి శుధ్య పనులను పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశా రు. వారు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గాన్ని పరిశుభ్రత పచ్చద నంలో రాష్ట్రానికి ఆద ర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. మార్కెట్ ప్రాం తాల్లో ఉండేవారు రోడ్లపై చెత్తను వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందజేయాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించారు. చెత్తను రోడ్లపై పారబోసే వారిపై కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. దుకాణాదారులు రోడ్లపై వేస్తే వారి ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎస్‌ఎస్ మురళి, ఎమ్మార్వో శ్రీనివాసులు, సీఐ సుధాకర్‌రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.