Share News

మొక్కలు నాటితే నీడ వస్తుంది

ABN , Publish Date - May 21 , 2026 | 12:11 AM

ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే నీడతో పాటు, స్వచ్ఛమైన గాలి ఇస్తుందని అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసరు రాణెమ్మ అన్నారు.

 మొక్కలు నాటితే నీడ వస్తుంది
మాట్లాడుతున్న సెక్షన్‌ ఆఫీసర్‌ రాణెమ్మ

రుద్రవరం, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే నీడతో పాటు, స్వచ్ఛమైన గాలి ఇస్తుందని అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసరు రాణెమ్మ అన్నారు. మండల పరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీపీ బాలస్వామి అధ్యక్షతన బుధవారం మండల సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి అధికారి తమ పరిధిలో విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జలజీవన్‌మిషన్‌ పథకం కింద 31 పనులు, 16 కోట్లతో నివేదికలు పంపించామన్నారు. పీఆర్‌ ఏఈ కమాల్‌సాహెబ్‌ మాట్లాడుతూ సీసీరోడ్డు రూ.2కోట్ల పైబడి నిధులతో నిర్మించామన్నారు. ఏవో సుమతి, ఎంఐ ఏఈ రఘురాం, ఆర్‌టీపీపీ అధికారి కోటేశ్వర్‌రావు డీటీ చంద్రశేకరయ్య, పశువైద్య ఏడీ మనోరంజన్‌ ప్రతాప్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజరు రషీదాబేగం, ఏపీఎం వసంతకుమారి, ఏపీవో గౌరీబాయి, తెలుగుగంగ ఏఈ రామచంద్ర, పశువైద్యాధికారి నాగ ప్రసన్న ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:11 AM