Share News

కల్యాణకట్ట అభివృద్ధికి ప్రణాళికలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:42 PM

శ్రీశైల క్షేత్రంలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తులకు కల్యాణకట్ట వద్ద సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపడతామని ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు అన్నారు.

కల్యాణకట్ట అభివృద్ధికి ప్రణాళికలు
క్షురకులకు భద్రత సామగ్రిని అందజేస్తున్న చైర్మన్‌

తలనీలాల క్షేత్రాన్ని పరిశీలించిన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌

శ్రీశైలం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తులకు కల్యాణకట్ట వద్ద సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపడతామని ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు అన్నారు. బుధవారం పాతాళగంగ మార్గంలో గల కల్యాణకట్టను ఆలయ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. కల్యాణకట్ట సిబ్బందితోపాటు పలువురు భక్తుల అభిప్రాయం మేరకు వస్త్రాలు మార్చుకునే గదులు, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్ర పరిధిలో పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించుకునే ప్రత్యేక కేంద్రాలు, స్నానపు గదులు ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 18 , 2026 | 11:42 PM