Share News

రైతులకే స్థానం

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:14 AM

: ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో రైతులకే స్థానం ఉండాలని కలెక్టర్‌ డా. సిరి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని సీ. క్యాంపు రైతుబజార్‌ను కలెక్టర్‌ పరిశీలించారు.

రైతులకే స్థానం
సి.క్యాంపు రైతుబజారులో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

రైతుబజార్లలో దళారులకు చోటు కల్పిస్తే చర్యలు

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో రైతులకే స్థానం ఉండాలని కలెక్టర్‌ డా. సిరి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని సీ. క్యాంపు రైతుబజార్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. రైతుబజార్‌లో కూరగాయలను విక్రయిస్తున్న రైతులు, పొదుపులక్ష్మి గ్రూపు మహిళలతో పాటు వినియోగదారులతో మాట్లాడి రైతుబజార్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుబజారులో రైతులకు, వినియోగదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దళారులు తమకు చోటు లేకుండా ఒత్తిడి, దౌర్జన్యం చేస్తున్నారని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. దానికి డా. సిరి స్పందిస్తూ దళారుల జాబితాను తనకు ఇవ్వాలని కర్నూలు ఆర్డీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌ కుమార్‌ రెడ్డి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ రఘు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రాజు, రైతుబజారు ఎస్టేట్‌ అధికారి కళ్యాణి పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:14 AM