డోన్‌లో పందుల స్వైర విహారం
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:54 PM
పట్టణంలో పందులు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు యజమానులు పందుల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా చేసుకోవడంతో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాక పందులను ఊరిబటకు తరలించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
రోడ్డుపై వదిలేస్తున్న యజమానులు
కళ్లు మూసుకున్న అధికారులు
డోన్ టౌన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పందులు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు యజమానులు పందుల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా చేసుకోవడంతో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాక పందులను ఊరిబటకు తరలించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల కుమ్మక్కు
పందుల యజమానులతో కొందరు అధికారులు కుమ్మక్కైనట్లు పట్టణ ప్రజలు విమర్విస్తున్నారు. పందుల సంచారం అధికం కావడంతో డెంగీ, మెదడు వాపు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇందిరానగర్, కొత్తపేట, తారకరామనగర్, చిగురుమానుపేటలో పందులు విపరీతంగా ఉన్నట్లు స్తానికులు అంటున్నారు.
కొత్త బస్టాండు ప్రాంతంలో విపరీతం..
కొత్తబస్టాండు ప్రాంతంలో పందులు అధికంగా ఉండటంతో బస్సులు ఎక్కేందుకు ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లు, హోటళ్ల నుంచి తీసుకువచ్చిన వ్యర్థ పదార్థాలను కొందరు ఇక్కడే పడేస్తుండటంతో అవి క్కడే తిష్టవేస్తున్నాయి.
యజమానులకు నోటీసు ఇచ్చాం
పందులను రోడ్లపై వదలకూడదని వాటి యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. పందుల యజమానులతో సమావేశం నిర్వహించి వాటిని దరంగా ఉంచాలని ఆదేవవంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పందుల యజమానులకు భూమిని కేటాయించి, పందుల కోసం డంప్ యార్డు చేశాం. అయితే నీటి నీటి సమస్య ఉందని పరిష్కరించాలని వారు కోరారు. వచ్చే వారంలో తహసీల్దార్, సీఐ, వ్యవసాయ అధికారులతో చర్చిస్తాం. గడువులోగా తరలించకపోతే యజమానులపై చర్యలు తీసుకుంటాం. - నరే్‌షరెడ్డి, మున్సిపల్ కమిషనర్