Share News

వైద్యవిద్యకు పునాది ఫిజియాలజీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:37 AM

వైద్యవిద్యలో ఫిజియాలజీ విభాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మానవ శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో తెలు సుకోవడానికి ఫిజియాలజీ పునాదిలాంటిదని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ అన్నారు

వైద్యవిద్యకు పునాది ఫిజియాలజీ
ఫిజియాలజీ వారోత్సవాల ప్రదర్శనను పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌

మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. కె. చిట్టినరసమ్మ

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యలో ఫిజియాలజీ విభాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మానవ శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో తెలు సుకోవడానికి ఫిజియాలజీ పునాదిలాంటిదని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ అన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఫిజియాలజీ వారోత్సవాల సందర్బంగా ప్రిన్సిపాల్‌ ఆ విభాగం ఏర్పాటు చేసి ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్బంగా వైద్యులు, వైద్యవిద్యార్థులు మానవ శరీరం నిర్మాణం, వివిధ అవ యవ వ్యవస్థలు, నాడీ వ్యవస్థ, గుండె, మెదడు వంటి అంశాలను ప్రతిభింబించే అంశాలు, రంగుల రంగవల్లుల చిత్రాలు ప్రదర్శించగా వాటిని చూసి ప్రిన్సిపాల్‌ అభినందనలు తెలిపారు. ఫిజియాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.లక్ష్మి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉమామహే శ్వరి, రమ్య, ఎలిజబెత సోఫియా, తులసిరాణి, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:37 AM