Share News

పూలే సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:59 PM

బీసీ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పూలే సేవలు చిరస్మరణీయం
పూలే విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

జ్యోతిరావుకు ఘన నివాళి

కల్లూరు, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బీసీ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం నగరంలోని బిర్లాగేట్‌ సమీపంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. గౌరుచరిత మాట్లాడుతూ కులవ్యవస్థ, సామాజిక అసమానతల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శంగా నిలిచిందన్నారు. కల్లూరు మండల పరిషత కార్యాల యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎంపీడీవో జి.నాగశేషాచలరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.

కర్నూలు న్యూసిటీ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా పరిషత డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి అన్నారు. పూలే జయంతి వేడుకలను శనివారం జడ్పీ మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు సరస్వతి, కే.జితేంద్ర, పుల్లయ్య, ఉద్యోగులు ఆంజనేయులు, సురేంద్ర పాల్గొన్నారు.

కర్నూలు అర్బన్‌: బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని ఉపకుల పతి వి.వెంకట బసవరావు అన్నారు. శనివారం రాయలసీమ యూనివ ర్సిటీలోని సేనేట్‌ హాలులో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమం లో రెక్టార్‌ ఎన్‌ టీకే నాయక్‌, రిజిసా్ట్రర్‌ విజకుమార్‌ నాయుడు, డీ నసీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన: స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూని యర్‌ కళాశాలలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా.ఎ్‌స.నాగస్వామి నాయక్‌, ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఓర్వకల్లు: జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంపీపీ తిప్పన్న పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏవో వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.

కోడుమూరు: పట్టణంలోని యూత్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే తులాజా భవాని ఆయలంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు షాకీర్‌, టెలిఫోన్‌ రాముడు, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్య, లాయర్‌ ప్రభాకర్‌, బలరాం, బీజేపీ నాయకులు మహే్‌షనాయుడు, విజయ్‌కుమార్‌, శంకర్‌, రంగస్వామి, సునీల్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:59 PM