Share News

పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:26 PM

సామాజిక సమా నత్వం, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పిలుపునిచ్చారు.

పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలి
పూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక సమా నత్వం, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని పద్మావతినగర్‌ ఆర్చ్‌ వద్ద జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన జయంతోత్సవ సభను మంత్రి, కలెక్టర్‌ జ్యోతిప్రజ్వలను చేసి ప్రారంభించారు. జేసీ కార్తీక్‌ మాట్లాడుతూ పూలే జీవితం సామాజిక న్యాయంకోసం సాగిన నిరంతర పోరా టానికి ప్రతీక అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, బీసీ సంక్షేమాధికారి జగ్గ య్య వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్యగౌడ్‌, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్‌, రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:26 PM