Share News

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:57 PM

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌ బాబు అన్నారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఏఐసీసీ సభ్యుడు సుధాకర్‌ బాబు

కర్నూలు అర్బన, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌ బాబు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసంద ర్భంగా సుధాకర్‌ బాబు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే కులవ్యవస్థ నిర్మూలనతోపాటు మహిళల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. కార్యక్ర మంలో నాయకులు బతుకన్న, బజారన్న, షేక్‌ ఖాజా హుస్సేన, వెంకట స్వామి పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:57 PM