Share News

‘పెట్రో’ ధరలను ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - May 27 , 2026 | 12:10 AM

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు డి.అబ్దుల్‌దేశాయ్‌, నగర నాయకుడు ఎస్‌ఎండీ షరీఫ్‌లు డిమాండ్‌ చేశారు.

‘పెట్రో’ ధరలను ఉపసంహరించుకోవాలి
నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

కర్నూలు న్యూసిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు డి.అబ్దుల్‌దేశాయ్‌, నగర నాయకుడు ఎస్‌ఎండీ షరీఫ్‌లు డిమాండ్‌ చేశారు. మంగళవారం పాతబస్తీ సీఐటీయూ అధ్వర్యంలో గడియారం ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. అబ్దుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రల ఎన్నికల తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నాలుగుసార్లు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుందన్నారు. ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలన్నారు. నాయకులు మద్దిలేటి, రాజేంద్ర ప్రసాద్‌, వెంకటేశ, శంకర్‌, రామన్న, అన్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:10 AM