‘పెట్రో’ ధరలను తగ్గించాలి
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:05 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్
కర్నూలు న్యూసిటీ, జూన 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం 5, 15, 43వ వార్డులలో సీపీఎం బృందం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిం చాలని కోరుతూ ప్రచార యాత్ర నిర్వహించారు. గౌస్‌దేశాయ్ మాట్లా డుతూ పెంచిన పెట్రోల, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలాని ఈనెల 9న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా నాయకులు ఎస్.ఏ.సుభాన, విజయరామాంజనే యులు, అబ్దుల్‌దే శాయ్, టి.రాముడు, పీఎస్.రాధాక్రిష్ణ పాల్గొన్నారు.