పెట్రో దిగుమతులను పెంచాలి
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:19 AM
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతను నివారించి దిగుమతులను పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గసభ్యుడు కే.రామాంజనేయులు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతను నివారించి దిగుమతులను పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గసభ్యుడు కే.రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళ వారం సీపీఐ అధ్వర్యంలో నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్, గ్యాస్ కొరత లేదని ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్నే ఎన్డీఏ కూటమి నేతలు ఒక్కసారి పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడాలన్నారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం, నాయకులు రామక్రిష్ణారెడ్డి, సి.మహేష్, నాగరాజు, బీసన్న, అన్వర్, రాముడు, గిడ్డారెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.