Share News

పెట్రో సంక్షోభం..!

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:29 PM

బెంగళూరులో ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కారులో మంగళవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి బయలుదేరారు.

పెట్రో సంక్షోభం..!
ఎమ్మిగనూరు పట్టణంలో 12 పెట్రో బంక్‌లు ఉన్నాయి. పెట్రో నిల్వలు లేక 11 బంక్‌లు బంద్‌ అయ్యాయి. ఆదోని రోడ్‌లో ఐవోసీ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఒక్కదానిలోనే పెట్రోల్‌ ఉందని వాహనదారులు కిక్కిరిసిపోయారు.

జిల్లాలో మూత పడిన 36 పెట్రోల్‌ బంకులు

నో స్టాక్‌ బోర్డులు.. వినియోగదారుల గుండెల్లో గుబులు

పెట్రోల్‌ ఉందంటే బారులు తీరుతున్న వాహనాలు

బెంగళూరులో ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కారులో మంగళవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి బయలుదేరారు. సాయంత్రానికి ఎమ్మిగనూరుకు రాగానే పెట్రోల్‌ అయిపోంది. ఏ పెట్రోల్‌ బంకుకు వెళ్లినా నో స్టాక్‌ బోర్డులే దర్శనం ఇచ్చాయి. చేసేది లేక రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం తెలిసిన వాళ్ల సహకారంతో పెట్రోల్‌ తెప్పించుకొని మంత్రాలయం బయలు దేరారు. మెజార్టీ వాహనదారులందరిదీ ఇదే పరిస్థితి. పెట్రోల్‌, డీజిల్‌ కొరతలతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పెట్రోల్‌ నిల్వలు లేక జిల్లాలో ఏకంగా 36 ఫిల్లింగ్‌ స్టేషన్లు (పెట్రో బంకులు) మూత పడ్డాయి. ఇందులో 90 శాతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందినవే. పెట్రోల్‌ కొరత లేదని, వినియోగదారులు రెట్టింపు ఇంధనం తీసుకెళ్తుండడం వల్ల ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

కర్నూలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు చెందిన 58, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లి మిటెడ్‌ (ఐవోసీఎల్‌)కు చెందిన 52, భారత్‌ పెట్రోలియం కార్పొ రేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చెందిన 30, ప్రైవేట్‌ రంగ సంస్థలు నయారకు చెందిన 22, జీయో కంపెనీ నాలుగు కలిపి జిల్లాలో 166 ఫిల్లింగ్‌ స్టేషన్లు (పెట్రోల్‌ బంకులు) ఉన్నాయి. జిల్లాలో రో జుకు 2.50లక్షల లీటర్లు పెట్రోల్‌, 3.18 లక్షల లీటర్లు డీజిల్‌ విని యోగం ఉంది. బుధవారం ఏపీ సివిల్‌ సప్లయ్‌ అధికారుల లెక్కల ప్రకారం ఆరు లక్షల లీటర్లు పెట్రోల్‌, ఏడు లక్షల లీటర్లు డీజిల్‌ ఉందని పేర్కొంటున్నారు. పెట్రో నిల్వలు ఉంటే నో స్టాక్‌ బోర్డులు ఎందుకు పెడుతున్నారు..? అంటే సమాధానం లేదు. జిల్లాలో అధికారిక లెక్కలు ప్రకారమే 36 పెట్రోల్‌ బంకులు పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు లేక మూత పడ్డాయి. ఎమ్మిగనూరులోనే దాదాపు 11 పెట్రోల్‌ బంకులు మూత పడ్డాయి. ఒకటి రెండు బంకుల్లో పెట్రోల్‌ ఉందని తెలియగానే వాహనదారులు పరుగులు పెడుతున్నారు. పలు చోట్లు ఘర్షణలకు జరుగుతున్నాయి.

పెట్రోల్‌ రాకపోతే అవస్థలే

జిల్లాలో పెట్రోల్‌ 6 లక్షలు లీటర్లు, డీజిల్‌ 7 లక్షల లీటర్లు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వారి లెక్కలు ప్రకారమే ఇది రెండు రోజులకు మించి సరిపోదు. నేటి సాయంత్రంలోగా అనంతపురం జిల్లా గుంతకల్లు, కడప జిల్లా బాక్రపేట నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ డీలర్లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయకపోతే సగానికిపైగా పెట్రో బంకులు మూతపడే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రం కర్నూలు నగరంలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో పెట్రోల్‌, డీజిల్‌ బంకులు మూతపడుతున్నాయి.

ఎందుకీ పరిస్థితి..!

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం భారత ఇంధన సరఫ రా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఓ చమురు సంస్థ ప్రతి నిధి పేర్కొన్నారు. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం ముగింపు సంద ర్భంగా ఇంధన సంస్ధలు రుణం ఇవ్వకపోవడంతో, నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లలో పెట్రోలు నింపుతున్నా యి. ప్రైవేట్‌ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ లీటరుపై రూ.4-5 వరకు పెంచాయి. రేపోమాపో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం.

జిల్లాలో కొరత లేదు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. రోజువారి వినియోగం కంటే రెట్టింపు నిల్వలు ఉన్నాయి. కొరత ఉందనే భయందోళనతో వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉండడంతో కొరత కనిపిస్తుంది. జిల్లాలో 36 పెట్రోల్‌ బంకుల్లో మాత్రమే నిల్వలు లేక నోస్టాక్‌ బోర్డులు ఉన్నాయి.

- ఎం. రాజా రఘువీర్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ మేనేజరు, కర్నూలు

Updated Date - Apr 22 , 2026 | 11:29 PM