Share News

పెట్రోలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:13 AM

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు

పెట్రోలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
కోడుమూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు

వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో

కోడుమూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌లో నిర్వహించిన రాస్తారోకోతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గఫూర్‌మియా మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచడం వలన సామాన్య ప్రజలపై భారం పడు తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ యుద్ధం కారణంగా దేశంలో చమురు సంక్షభం ఏర్పడిందన్నారు. యుద్ధం పేరుతో ప్రజలపై ఆర్థికం భారం మోపడం దారుణమన్నారు. వీటి వలన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెగురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు వీరన్న, శేషుకుమార్‌, లక్ష్మన్న, రంగస్వామి, రాజు, రాముడు పాల్గొన్నారు.

ఓర్వకల్లు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ బస్టాండు ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాగన్న, సీపీఐ మండల సహాయ కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధుసూదన అధ్యక్షతన నిరసన, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, మద్దయ్య, ఎల్లరాజు, మధు పాల్గొన్నారు.

గూడూరు: పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన హ్చెరించారు. మంగళవారం గూడూరులో సీపీఎం ప్రాంతీయ నాయకులు రాజశేఖర్‌, సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన వామపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీఎం పాంత్రీయ కార్యదర్శి జె మోహన, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పది రోజల వ్యవధిలోనే నాలుగు మా ర్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేసింద న్నారు. సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

కల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సామాన్య ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారాన్ని తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశా రు. మంగళవారం కల్లూరు మండ లం చిన్నటేకూరు జాతీయ రహదా రిపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యు డు గురుశేఖర్‌ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. కార్యక్రమంలో నరసింహ, మండల నాయకులు ఏ.కృష్ణ, మధు, రాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:14 AM