Share News

పెట్రోలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:52 PM

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

పెట్రోలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలి
మానవహారం నిర్వహిస్తున్న వామపక్షాలు

వామపక్ష నాయకుల డిమాండ్‌

రాజ్‌విహార్‌లో రాస్తారోకో

గంటసేపు స్తంభించిన ట్రాఫిక్‌

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు మంగళ వారం నగరంలోని జిల్లా పరిషత్‌ నుంచి రాజవిహార్‌ వరకు ర్యాలీగా వచ్చి సెంటర్‌లో గంటసేపు రాస్తారోకో కార్యక్రమం నిర్వహిం చారు. దీంతో గంట సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముందుగానే అప్రమ త్తమైన ట్రాఫిక్‌ పోలీసులు ఆర్టీసీ బస్సులను, ట్రాపిక్‌ను మళ్లిం చారు. సీపీఎం న్యూసిటీ కార్యదర్శి రాముడు, సీపీఐ నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, ఎన్‌యూ సీఐ జిల్లా నాయకులు హరీష్‌ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కే. రామాంజనేయులు హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసి ఎన్నికలు పూర్తయిన వెంటనే భారీగా వంట గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచిందని విమర్శించారు. ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడిందని అన్నారు. రవాణా రంగంపై పెరిగిన ధరల ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయా యయని మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల నిజ స్వరూపాన్ని పెరిగిన ధరలు తెలియజేస్తు న్నాయని అన్నారు. పెంచిన ధరలు తగ్గించే వరకు పోరాడుతూనే ఉంటా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పాత బస్తీ కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు నగేష్‌, నరసింహులు, సీపీఐ సీనియర్‌ నాయకులు కే. జగన్నాథం, జిల్లా సహాయ కార్య దర్శి మునెప్ప, శ్రీనివాసరావు, సీపీఐఎంఎల్‌ నాయకులు, ఎన్‌యూసీఐ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:52 PM