Share News

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - May 16 , 2026 | 12:22 AM

పెట్రోల్‌, డీజిల్‌పై మూడు రూపాయలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌ్‌సదేశాయ్‌ డిమాండ్‌ చేశారు.

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి
ధర్నాలో చేస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు న్యూసిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌పై మూడు రూపాయలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌ్‌సదేశాయ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ అధ్వర్యంలో పెంచిన డీజిల్‌, పెట్రోలు ధరలు ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 సంవత్సరాల కింద రూ. 55 రూపాయలు ఉన్న పెట్రోలు ధర రూ. 113 వచ్చిందన్నారు. దేశంలో అందరికి సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తయిన వెంటనే చమురు ధరలు పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పాతబస్తీ కార్యదర్శి రాజశేఖర్‌, విజయ్‌, షరీఫ్‌, సుధాకరప్ప, అబ్దుల్‌ దేశాయ్‌, రామక్రిష్ణ, ప్రభాకర్‌, నరసింహులు, ఏసు తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లా వ్యాప్త నిరసనలు

సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

కర్నూలు న్యూసిటీ, మే 15(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌, వాణిజ్య గ్యాస్‌, సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతే శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, మండల కేంద్రాలలో నిరసనలు చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తెలిపారు. శుక్రవారం సీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రి ముగిసిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెట్రో ధరల భారం కనుకగా ఇచ్చిందన్నారు. శనివారం చేపట్టే నిరసనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌. మునెప్ప, నక్కి లెనిన్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:22 AM