గడువులోపు అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:51 PM
ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రీ ఓపెన్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా మొత్తం 263 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 141 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వచ్చే వారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. పీజీఆర్‌ఎస్ జరిగే రోజున అధికారులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరవ్వాలని, అనుమతి లేకుండా జిల్లా విడిచి వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ అభ్యాస వారం సందర్భంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్న ప్రతి అధికారి కనీసం 4 గంటల అభ్యాసాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. డాక్యుమెంట్ అప్లోడింగ్‌లో తహసీల్దార్లు, జిల్లా స్థాయి అధికారులు వెనుకబడి ఉనన్నారని, లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.