అర్జీలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:19 AM
ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చాయి. కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, ఎంఈ మనోహర్‌రెడ్డి, మేనేజర్ జునైద్, ఆర్‌ఓ స్వర్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, టిడ్కో అధికారి పెంచలయ్య పాల్గొన్నారు.