దివ్యాంగులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:07 AM
విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
వెలుగోడు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సహకారంతో శ్రీశైలం నియోజక వర్గంలోని పదిమంది విభిన్న ప్రతిభావంతులకు పది రెట్రో ఫిట్టెడ్ స్కూటర్లు మంజూరు అయ్యాయి. వాటిని మంగళ వారం వేల్పనూరులోని ఆయన స్వగృహంలో వాటిని లబ్ధ్దిదారు లకు పంపిణీ చేశారు. అనంతరం ఓ లబ్ధిదారుని వాహనమెక్కి చక్కర్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.